Display:
శృంగార సంకీర్తన
రేకు: 85-6
సంపుటము: 5-325
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
రాయడికాఁడు గదమ్మ రంతు నేసీని
పాయపు సతులనే గోపాల గోవిందుఁడు
॥పల్లవి॥
వట్టిమాయలఁ బెట్టవలదన్న మానఁడు
బెట్టుగ రేపల్లె గోపికలనెల్ల
యెట్టు వేగింతురమ్మ యెల్లవారలును
రట్టడియైనట్టి రాచగోవిందుఁడు
॥రాయ॥
లేని పగలు చాటి లేమలనిందరిని
కాని కానిమ్మనుచుఁ గరఁగించీని
మాని మాని కమ్మర మగుడ మమ్మేఁచీని
రానిలే చూచుఁగాని రాచగోవిందుఁడు
॥రాయ॥
పొద్దు వొద్దునకెంతే బూమెలు సేయుచును
వొద్దికై నాతోడ నొనగూడీని
అద్దో యింకా మానఁడాసలఁ బెట్టెడిని
గద్దరి శ్రీ తిరువేంకటపు గోవిందుఁడు
॥రాయ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము