శృంగార సంకీర్తన
రేకు: 86-3
సంపుటము: 5-328
రేకు: 86-3
సంపుటము: 5-328
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| పంతమాడి పిలిచినఁ బలుకదెవ్వరితోడ యింత వలచిన వలపెందునైనఁ గలదా | ॥పల్లవి॥ |
| వెక్కనపు గుబ్బలపైవేసిన కప్పురమెల్ల నొక్కమాటే నీరాయనోయమ్మా మిక్కుటమైన దీని మేనిమీఁది వెక్కచూచి వక్కలాయ గుండె యిట్టి వలపెందుఁ గలదా | ॥పంత॥ |
| గుప్పెడి నిట్టూరుపుల కోమలిహరములెల్ల వుప్పరాలెగయఁ జొచ్చెనోయమ్మా వుప్పతిల్లుఁ జెమటల నోలలాడఁగానె మేను నిప్పువలెనున్నదిట్టి నెయ్యమెందుఁ గలదా | ॥పంత॥ |
| కొయ్యతనమునిట్టె కోనెటిరాయనిఁ గూడి వుయ్యాలమంచముమీఁదనోయమ్మా పయ్యెదచెరఁగు జారఁ బచ్చిసేఁతలిన్నియును ముయ్యఁజూచీ నిటువంటిమోహమెందుఁ గలదా | ॥పంత॥ |


