శృంగార సంకీర్తన
రేకు: 86-5
సంపుటము: 5-330
రేకు: 86-5
సంపుటము: 5-330
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం, రచ్చెతాళం
| కనలకువే మతి కలఁగీని యీ- వనజోదరుఁడిదె వచ్చీనిపుడు | ॥పల్లవి॥ |
| వడిఁ గుచభరమున వ్రాలెడి వేగము నడవకువే సన్నపు నడుము చిడుముడి నన్నుఁ జేసిన గోవిందుఁడు తడయఁడు నిన్నుఁ దగిలీనిపుడు | ॥కనల॥ |
| కొప్పువేఁగుననె కుదిసిన మెడ గడు- తిప్పకువే కందెడి సరులు దప్పివొదలఁ బరితాపము నీమై కప్పిన శ్రీహరి గదిసీఁ గాని | ॥కనల॥ |
| పొరలుచు నిట్టూర్పులను సురనియెదు వెరవకుమెన్నఁడు వేదనల కరఁగి నీవు వేంకటపతికౌఁగిట మెరసితివిటు కడు మించిన రతుల | ॥కనల॥ |


