శృంగార సంకీర్తన
రేకు: 86-6
సంపుటము: 5-331
రేకు: 86-6
సంపుటము: 5-331
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| అలికి సంపెఁగ తావి కణఁగినట్టు తొలఁగీ నుదుట జారి తుమ్మిదల పిల్లలు | ॥పల్లవి॥ |
| వెలఁదియారను పాము వెంటఁబెట్టుకొని రాఁగా తలఁకి చంద్రుఁడు వోయి దాఁగినట్టు పలువెన్నె మెఱుఁగుల పయ్యదలోనె దాఁగె చలివేఁడి మెఱుఁగుల చందమామపిల్లలు | ॥అలికి॥ |
| కోవిలపలుకుదాడి కోపగించి వెంటరాఁగా తావుల చిగురువోయి దాఁగినట్టు మోవి సూదివాటులై మొనసి కానవచ్చీని మావుల చిగురులోని మాణికాలపిల్లలు | ॥అలికి॥ |
| భారమైన విరహతాపపు సూరియుండు రాఁగా తారితారి చకోరాలు దాఁగినట్టు కూరిమి వేంకటపతిఁ గూడిన తమకమున గోరగించీనిదివో చకోరములు పిల్లలు | ॥అలికి॥ |


