శృంగార సంకీర్తన
రేకు: 88-2
సంపుటము: 5-339
రేకు: 88-2
సంపుటము: 5-339
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| తరుణికనుఁగవ మోడ్పు తగఁ జూడరే వరునిఁ దనమతి సొలసి వడిఁ జూచినట్లు | ॥పల్లవి॥ |
| వెలఁది ముక్కున వెడలు వేఁడి నిట్టూరుపుల - చెలువమెటువలెనుండెఁ జెప్ప-గదరే చలముకొను నలులకును సంపంగి పెనుగాలి కలకంటిమేనికిని కాపిడినయట్లు | ॥తరుణి॥ |
| పడతిపైనునుఁ జెమట పన్నీటితావితో బడిబడినె యెట్లుండె భావింపరే అడరు విరహానలంబప్పటప్పటికార్చ కడువేగముదకముడుగక చల్లి నట్లు | ॥తరుణి॥ |
| ఇంతినెన్నుదుటిపై నిపుడు చెదరిన కురులు వింతలై యెట్లుండె వివరించరే సంతమై వేంకటేశ్వరుఁడు చెలినేఁపు శశి- సంతముడుపఁగఁ దమము పరె విడిచినట్లు | ॥తరుణి॥ |


