శృంగార సంకీర్తన
రేకు: 88-6
సంపుటము: 5-343
రేకు: 88-6
సంపుటము: 5-343
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| నిద్దిరించి పాల(చీ-బాల?) జలనిధివలెనే వొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు | ॥పల్లవి॥ |
| వేగుదాఁకాఁ జిత్తగించి విద్యలెల్ల నాదరించి బాగుగాఁ గృపారసము పంచి పంచి యేగతిఁ బవ్వళించెనో యెట్ల భోగించెనో యోగీంద్రవరదుని వూఁచరే వుయ్యాలను | ॥నిద్ది॥ |
| వాలుఁగన్నుల రెప్పల వడదాఁకి తనుతావి చాలుకొన్న వూర్పులు చల్లి చల్లి నీలవర్ణపుగుణము నెరవుచు నొకయింత- కాలము గన్నులఁ దిప్పికప్పరే దోమతెర | ॥నిద్ది॥ |
| సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁ గరుణించఁ దలఁచి వేంకటగిరిపై అరుదుగ సకలలోకారాధ్యుఁడయి మించి విరివి నాలవట్టాలు విసరరే సతులు | ॥నిద్ది॥ |


