శృంగార సంకీర్తన
రేకు: 90-3
సంపుటము: 5-352
రేకు: 90-3
సంపుటము: 5-352
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
| నెలఁతకుఁ గొండలతిమ్మని నేనిదె తోడ్కొని వచ్చెద ఎలనాగలు మీరెందరు నేమరకుఁడి చెలిని | ॥పల్లవి॥ |
| వలపుల రెనికి చెంగలువల కొండము చొర మొక్కుఁడి అలులకు పూఁదేనియ సోయగములు మెయికొనుఁడి ఫలరసములు మీఁదెత్తుఁడి పదరి చిలుకలకును గోవిలలకు పొలఁతికి కెందమ్మిరేకులు పోయుఁడు బడిమిగను | ॥నెలఁత॥ |
| కట్టుఁడి సన్నపువలిపెము కర్పూరముఁ బన్నీరును దట్టముగాఁ బైనలఁదుఁడి తరుణీమణికి ఒట్టుఁడి జాజులు పరపున నొరపెరిఁగిన చెలికత్తెలఁ బెట్టుఁచి మరుబలములచే బెగ్గిలి పడకుండ | ॥నెలఁత॥ |
| చిగురునఁ గెంపులు మొలచెను చిత్రము చూడఁగదమ్మా మొగుడులపైనల చంద్రుని మూఁకలు మరిగినవి మొగమున బిత్తరిచేఁతలు మును లేనివి చెలికబ్బెను మగువయు తిరువేంకటపతి మమతల పరిణతలు | ॥నెలఁత॥ |


