శృంగార సంకీర్తన
రేకు: 90-6
సంపుటము: 5-355
రేకు: 90-6
సంపుటము: 5-355
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఎట్టు ధరియించెనో యీ యింతి హృదయంబు పట్టనెట్లోపునో ప్రాణవాయువులు | ॥పల్లవి॥ |
| వడియుఁ జెమటలనుఁ దుడువఁ గరాని పన్నీట తడియుఁ బయ్యదయుఁ దత్తరమందు మనసు సుడియుఁ దమకములచే సొలయు నలపుల మేన విడియుఁ బులకలు చూడ వెరగైన మోము | ॥ఎట్టు॥ |
| మురియుఁదలఁపులును జలమునఁబొదలు మదనాగ్నిఁ నురియుదేహంబు గడు నుదుటుఁగోరికలు విరియు మానంబు నరవిరి సొలపుమాఁటలునుఁ గురియు మోహజలంబు కొదలుఁజూపులును | ॥ఎట్టు॥ |
| వెదచల్లునూర్పులును వెలితైన నవ్వులును సదమదంబైన పలుచనిమేనిపూఁత అదన శ్రీ తిరువేంకటాద్రీశు కౌఁగిటను గదిసి యింపులఁ బొదలఁ గలిగె నీ చెలికి | ॥ఎట్టు॥ |


