శృంగార సంకీర్తన
రేకు: 91-6
సంపుటము: 5-361
రేకు: 91-6
సంపుటము: 5-361
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| సువ్వి సువ్వి సువ్వలమ్మ నవ్వుచు దేవకినందనుఁ గనియె | ॥పల్లవి॥ |
| శశి వొడచె అలసంబులు గడచె దిశల దేవతల దిగుళ్ళు విడిచె | ॥సువ్వి॥ |
| కావిరా విరిసె కంసుఁడు గినిసె వావిరిఁ బువ్వులవానలు గురిసె | ॥సువ్వి॥ |
| గతిసేసె ఆటు గాడిద గూనె కుతిలకుడిచి జనకుఁడు నోరుమూసె | ॥సువ్వి॥ |
| గగురు పొడిచె లోకము విధి విడిచె మొగులు గురియఁగ యమున పై నడచె | ॥సువ్వి॥ |
| కలి జారె వేంకటపతి మీరె అలమేల్మంగనాచారలుకలు దీరె | ॥సువ్వి॥ |


