శృంగార సంకీర్తన
రేకు: 92-2
సంపుటము: 5-363
రేకు: 92-2
సంపుటము: 5-363
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సావేరి, జంపెతాళం
| మెచ్చె నొకరాగంబు మీఁద మీఁద కడు- నిచ్చె నొకరాగంబు యింతులకు నెల్ల | ॥పల్లవి॥ |
| చేసెనొకరాగంబు చెలియెదుటఁ గన్నులనె మూసెనొకరాగంబు ముదిత మతినె పూసెనొకరాగంబు పొలిఁతిపులకలమేన వ్రాసెనొకరాగంబు వనిత నినుఁబాసి | ॥మెచ్చె॥ |
| పట్టెనొకరాగంబు ప్రాణములపై నలిగి తిట్టెనొకరాగంబు తిరిగి తిరిగి పుట్టెనొకరాగంబు పొలఁతిడెందమునకును మెట్టెనొకరాగంబు మెరయుచునె కదలి | ॥మెచ్చె॥ |
| కురిసెనొకరాగంబు కొప్పు పువ్వులనె సతి మురిసెనొకరాగంబు ముంచి మేన తిరువేంకటేశ్వరుఁడ తెలుసుకో నినుఁబొంది పొరసెనొకరాగంబు పొలఁతికుచములనే | ॥మెచ్చె॥ |


