శృంగార సంకీర్తన
రేకు: 92-4
సంపుటము: 5-365
రేకు: 92-4
సంపుటము: 5-365
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంభోది
| వలపేడఁ గలిగెనే వామలోచనకు దీని వలపించి నటువంటివాఁడింక నెవ్వఁడో | ॥పల్లవి॥ |
| సిరులు గల మోమెల్ల చిరునవ్వుగనుదోయి విరివైన వురమెల్ల వేఁకమైన గుబ్బలు తరుణికి వెనకెల్లఁ దురుము పిఱుఁదులును మంచి- నిరతంపు నడపెల్ల నిండుమురిపెములు | ॥వల॥ |
| జలజాక్షినిలువెల్ల చక్కఁదనముల పోగు కలికితనమెల్లఁ గన్నులపండువు కలకంటివయసెల్ల గడుఁ గోమలము దీని- పలకుఁదేనియలెల్ల పంచదారకుప్పలు | ॥వల॥ |
| చెలువైన మోవెల్ల చిలుకవోట్లు దీనిఁ కలదేహమింతయునుఁ గస్తూరివాసనలు అలరించెఁ దిరువేంకటాధీశ్వరుఁడు దీని- తలఁపెల్ల విభునిలో దాఁగున్న కరువు | ॥వల॥ |


