శృంగార సంకీర్తన
రేకు: 93-1
సంపుటము: 5-368
రేకు: 93-1
సంపుటము: 5-368
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| జాజు జాజేకాక దిరిశపుఁ బువ్వౌనా నీ జాడెంతయిన నీవు మానేవా | ॥పల్లవి॥ |
| సంపెంగపూవులలోన సారెకుఁ జూచిన తన- కంపే కాక తనకాఁక మానీనా యింపులు గొందరికి యీరసాలు గొందరికి జంపుల నీ గుణముల జాడ మానేవా | ॥జాజు॥ |
| పొగడ పూవులలోన పొందుగఁ జూచిన తావి తగుఁగాక తా మదము మానీనా నిగిడిన నీచేఁత నీ బోంట్ల కే కాక మగిడి నీగుణములు మంచివయ్యీనా | ॥జాజు॥ |
| కామించి కలువలు కన్నులనద్దుకొనిన కామునమ్ములునేఁడు గాక మానీనా దీమసపు వేంకటేశ తెమలని కూటముల ఆమని మాకోరికల ఆస మానీనా | ॥జాజు॥ |


