శృంగార సంకీర్తన
రేకు: 93-3
సంపుటము: 5-370
రేకు: 93-3
సంపుటము: 5-370
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| సల్లుసూపుల సలమారి యిఁక వెల్లఁ బో నన్ను సెనకఁడుగా | ॥పల్లవి॥ |
| సంకు సక్రముల సక్కనయ్యకుఁ దన- వుంకువవో నావొళ్ళెల్లా సంకనున్న తన సదురాలి మొరఁగైన సింకసూపు నాపై సిమ్మఁడుగా | ॥సల్లు॥ |
| మాపురేపుసూపు మాయలయ్యకుఁ దన- దాఁపురమువో నాతలఁపెల్లా వీఁపురమణికంత వెఱవకయినఁ దన పూఁపనవ్వు నాపైఁ బుయ్యఁడుగా | ॥సల్లు॥ |
| వుసురుఁ బడుకమీఁదనొరగిన్న సక్కని- రసికుఁడు వేంకటరాయఁడు పసపుశీర నాకుఁ బరపుగాఁ బరపించి యెసగ నిట్టె సనవియ్యఁడుగా | ॥సల్లు॥ |


