శృంగార సంకీర్తన
రేకు: 93-5
సంపుటము: 5-372
రేకు: 93-5
సంపుటము: 5-372
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధదేశి
| మొలనూలి గొల్లెత మురియుచును వలవంతఁ దిరిగీని వాడవాడలను* | ॥పల్లవి॥ |
| సంపెఁగలతురుముతో చల్లలమ్మీనిదివొ పంపుమోము గొల్లెత వాడలను యింపులకోరికె తో నిందిరాపతి యెదుట జంపుల నటనలతో సాళగింపుచును | ॥మొల॥ |
| నొసలికస్తూరితోఁ గన్నుల నవ్వీనిదివో పసివాడు గొల్లెత వాడలను కసరుచు హరిమీఁదికాఁకల కోపముతో యెసరుఁ జెమట గోర యెమ్మెలఁ జిమ్ముచును | ॥మొల॥ |
| చెలువంపుటుంగరాల చెయి వీచీనిదివో వలపుల గొల్లెత వాడలను కలికియై తిరువేంకటవిభుకౌఁగిట అలసిన నటనల నల్లంతనేఁగుచును | ॥మొల॥ |


