శృంగార సంకీర్తన
రేకు: 93-6
సంపుటము: 5-373
రేకు: 93-6
సంపుటము: 5-373
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| మెఱ్ఱో నేననఁగానే మొక్కేవు గాని వెఱ్ఱి నేను వెఱ్ఱి నేను వెఱ్ఱి నేను సుమ్మీ | ॥పల్లవి॥ |
| సడ్డలాడఁగానే కడు జారినపయ్యద చూచి యెడ్డ నన్ను జాణఁజేసేవేఁటికో కాని వడ్డివారే వలపుల వన్నెవెట్టనేర నే గొడ్డేరే గొడ్డేరే గొడ్డేరే సుమ్మీ | ॥మొఱ్ఱో॥ |
| ఒల్లననఁగానే నన్నునుద్దండపుఁ దుటారాల చల్లలమ్మఁగానే పగ చాటేవు గాని కల్లలాడనేర నీతో కపటాలు నేర నే గొల్లదాన గొల్లదాన గొల్లదానఁ జుమ్మీ | ॥మొఱ్ఱో॥ |
| వేంకటేశుఁడ నేనంటా వేసాలఁ బొయ్యేనంటా అంకులచేతులుచూచి యంటితి గాని కంకిగా గుబ్బలమీఁద గాజునఁ దీసేవు నే వుంకువొల్ల నుంకునొల్ల నుంకునొల్లఁ జుమ్మీ | ॥మొఱ్ఱో॥ |


