శృంగార సంకీర్తన
రేకు: 94-3
సంపుటము: 5-376
రేకు: 94-3
సంపుటము: 5-376
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| నిన్నుఁ గూడిన విభుని నిలువెల్ల సొంపాయ నిన్నియును నొనగూడె నింతలోపలనె | ॥పల్లవి॥ |
| సొలపు నీ కడగంటిచూపు హృదయము గాఁడి లలినితఁడు శ్రీవత్సలాంఛనుండాయ వెలఁది నినుఁ బెడఁ బాసి విరహంపుమెయికాఁక - వలన నీతఁడు నీలవర్ణుఁడైనాఁడు | ॥నిన్ను॥ |
| అదన నీ చనుగుబ్బలను చక్రముల చేతఁ బదిలపరపుచు చక్రపాణియైనాఁడు సుదతి నీ దేహమున సొబగు కుంకుమపూఁత- లెదిగి పీతాంబరంబీతనికి నాయ | ॥నిన్ను॥ |
| ఆలింగనాపేక్షననయంబు నినుఁగూడ లోలుఁడటుగాన నాలుగుచేతులాయ శ్రీలలితమూ ర్తియగు శ్రీ వేంకటేశ్వరుఁడు పాలించె నిను నీకుఁ బరితోషమాయ | ॥నిన్ను॥ |


