శృంగార సంకీర్తన
రేకు: 94-4
సంపుటము: 5-377
రేకు: 94-4
సంపుటము: 5-377
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| కందువ నేఁడెందరైనాఁ గలరు నీకు యిందరిలో నాప్రియ మీడేరీనా | ॥పల్లవి॥ |
| సన్నలు సేసేటి వారు సరసమాడేటివారు కన్నుల మొక్కేటివారు గలరు నీకు విన్ననై యిందరికిని వెరవనే కాక నాఁ విన్నపమెంతైన నీకు వినఁదీరీనా | ॥కందు॥ |
| తేఁకువఁ జేరేటివారు తేనెల మాఁటలవారు కాఁకలు సేసేటివారు గలరు నీకు యేఁకటనిందరికడ నెడతాఁకనేకాక సోఁకనాడే నావంక చూడఁగూడీనా | ॥కందు॥ |
| ముద్దులు గునియువారు ముచ్చటలాడెడివారు గద్దించి తిట్టెడివారు గలరు నీకు తిద్దిన నీవిద్యలివి తిరువేంకటేశ నా- వొద్దఁ గూడి యిట్ల నీకు వుండఁగూడీనా | ॥కందు॥ |


