Display:
శృంగార సంకీర్తన
రేకు: 95-1
సంపుటము: 5-378
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
సీతక పడుసు దోసిటి పాల మగఁడు
బాతి పడిన నగపడునటె వీఁడు*
॥పల్లవి॥
మూడు గాళ్ళపెద్ద ముసలి సవులుగొన్న పాఁడిమేకల పాల పాశము
వేఁడి జుఱ్ఱినతల్లి వేఁకటియై కన్న- వాఁడు వీఁడు శిన్న వాఁడటె వీఁడు
॥సీత॥
కొండలంత సను గుబ్బలరాకాశి - మిండెత గవిశి పై మింగ రాఁగా
గుండె వగులనొక్క కోలనె సరగన -సెండివేసినట్టి సిసు వటె వీఁడు
॥సీత॥
వుడుకు నుదుటివాఁడు వుదుటున దాఁసిన- బెడిదపు మోతల పెనువిల్లు
తొడికి విరిశివేశి దోమటి నునుఁబాల- కడుపుల తొలి పెండ్లికొడుకటె వీఁడు
॥సీత॥
మారుదల్లి సేతిమాటలఁ బడలేక -వూరు విడిశి యడవులకేఁగి
సేరవచ్చిన యింతి సెవులు ముక్కుఁగోశి - పేరువారిన పెద్దబిరుదటె వీఁడు
॥సీత॥
పొగదాగు తపసుల పుల్లవెలుగు మంట - లగడు శేయఁగ ముగురసురల
సగము సాయ సంపి సడిఁబెట్టి విడిశిన-బగిడికాఁడు సిన్నపడుసటె వీఁడు
॥సీత॥
మిసమిస మెరసేటి మెగముమేనిపై - పసలఁ దగిలి వెంటఁ బారి పారి
గసిక వింటికోల గరిగాఁడనేసిన -మసిమాయల సలమరి గదె వీఁడు
॥సీత॥
రవ్వల సేఁతల రాకాశినాయని - కొవ్విన మదము తె క్కోలుగొని
యివ్వలఁ దిరువేంకటేశుఁడై యున్నాఁడు -గువ్వెక నిను జట్టిగొనెఁగదె వీఁడు
॥సీత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము