శృంగార సంకీర్తన
రేకు: 42-2
సంపుటము: 6-2
రేకు: 42-2
సంపుటము: 6-2
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| ప్రాయంపు మదములే పరిణామము మతిఁ బాయని రమణికి నీపై నెంత వలపో | ॥పల్లవి॥ |
| తుమ్మిపూవుఁగొలనిలో తరుణులుందాము మిండ తుమ్మెద లీఁదులాడంగ దొంగి చూచి కొమ్మ నినుఁ గూడి కేళాకూళితోఁ గస్తూరినీట నిమ్ముల నోలలాడిన దెటువంటి వలపో | ॥ప్రాయ॥ |
| కొదమమావిపై గండుఁగోవిల లేఁజిగురాకు ముదిత కందీఁగా ప్రేమమునఁదాఁజూచి అదివొ యుప్పరిగెపై నాకుమడిచి నీ వీఁగా వదనాన నందుకొనె వడి నెంత వలపో | ॥ప్రాయ॥ |
| నెయ్యంపుఁ జకోరము వెన్నెల రస మింతినోర నొయ్యనె కుమ్మరించంగ నువిదచూచి కయ్యంపుంగూటమిని వేంకటేశుండ తమ్మరస మియ్యంగఁ జొక్కితివి నీ విపుడెంతవలపో? | ॥ప్రాయ॥ |


