శృంగార సంకీర్తన
రేకు: 43-1
సంపుటము: 6-7
రేకు: 43-1
సంపుటము: 6-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| అతను సంపదకంటె నసదా చెలిరూపు మతిచింతచేత వేమరు నలఁగెఁ గాక | ॥పల్లవి॥ |
| తగుఁ జందురుని నణఁచఁ దగదా చెలిమోము వగలచే నొకయింత వాడెఁగాక పగటుఁగోవెల మించి పాఱదా సతి పలుకు జగడమునఁ బతిఁబాసి సన్నగిలెఁ గాక | ॥అతను॥ |
| కదలు గందపు గాలి గా(వ?)దా చెలియూర్పు కదిమేటి మదనాగ్నిఁగ్రాఁగెఁ గాక కొదమ తుమ్మెదగమికిఁ గొఱఁతా చెలితురుము చెదరి మరుబాణముల చే జాఱెఁగాక | ॥అతను॥ |
| లీలఁబన్నీటికిని లేఁతా చెలి చెమట లోలిఁ బూఁబానుపున నుడికెఁగాక యేలచిగురునకంటె నెరవా చెలిమోవి గేలి వేంకట విభుఁడు గీలించెఁగాక | ॥అతను॥ |


