శృంగార సంకీర్తన
రేకు: 43-3
సంపుటము: 6-9
రేకు: 43-3
సంపుటము: 6-9
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం, ఏకతాళి
| తొల్లిటివలెఁ గావు తుమ్మెదా యింక నొల్లవుగా మమ్మునో తుమ్మెదా | ॥పల్లవి॥ |
| తోరంపు రచనల తుమ్మెదా కడుఁ దూరేవు గొందులే తుమ్మెదా దూరిన నెఱఁగవు తుమ్మెదా మమ్ము నోరగఁజూడకువో వో తుమ్మెదా | ॥తొల్లి॥ |
| తొలు ప్రాయపు మిండ తుమ్మెదా కడుఁ దొలిచేవు చేఁగలే తుమ్మెదా తొలుకరి మెఱుఁగనే తుమ్మెదా యింక నులికేవు మముఁగని వో వోతుమ్మెదా | ॥తొల్లి॥ |
| దొరవు వేంకటగిరి తుమ్మెదా మా తురు మేల చెనకేవు తుమ్మెదా దొరకె నీ చనవులు తుమ్మెదా యింక నొరు లెఱింగిరి గదవో వో తుమ్మెదా | ॥తొల్లి॥ |


