శృంగార సంకీర్తన
రేకు: 43-6
సంపుటము: 6-12
రేకు: 43-6
సంపుటము: 6-12
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| సతికి నిటువంటి రాజస మేల కలిగెనే తతిగొన్న విరహాగ్ని ధరియించలేదు | ॥పల్లవి॥ |
| తోరమగు భారంపు తురుమేల కలిగెనే నారీమణికి మెఱుఁగు నళినముఖికి వైరంపు మరుని నెవ్వగల బాణాగ్నిచే జారఁగా పలుమారు సవరించ లేదు | ॥సతికి॥ |
| వెలఁదికి జఘనంపుఁ వ్రేఁగేల కలిగెనే కలహంస గమనమునఁ గదల లేదు నలికంపు నడుము సన్నమున నవకపు మణుల మొలనూలు జారఁగా మోవనే లేదు | ॥సతికి॥ |
| ఇంతికిని చక్కఁదన మింతేల కలిగెనే వంతఁ బొరలించు యౌవన మదమున ఇంత లోననె వేంకటేశు కౌఁగిటఁగలసి మంతనపుఁ బరవశము మతిఁ దెలియలేదు | ॥సతికి॥ |


