శృంగార సంకీర్తన
రేకు: 44-1
సంపుటము: 6-13
రేకు: 44-1
సంపుటము: 6-13
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| కనుమూసెఁ గదె దీని గరువంపుఁ దెలివి చనుదోయి పైకొంగు జారిన నెఱుఁగదు | ॥పల్లవి॥ |
| తలకెక్కెఁగదె దీని తనువికారములు పొలుపైన నెరులు కొప్పున జారెను చలి ముంచెఁగదె దీని జవ్వనపు మదము పులకజొంపములచేఁ బొరలెక్కె మేను | ॥కను॥ |
| వడదాఁకెఁగదె దీని వాల్ గన్నుఁగొనలు చిడుముడి ముచ్చటతో సిగ్గువడీని బడిదప్పెఁ గదె దీని పలుకుఁదేనియలు తడఁబాటుతోడ చిత్తము దాఁచెనిపుడు | ॥కను॥ |
| కసరెక్కెఁగదె దీని కస్తూరి చెమట అసలుఁ గుంకుమ తోడ నలరీని మేన ఉసురెక్కెఁగదె దీని యొరుపు నూరుపుల పొసఁగి వేంకటపతి పొందు దెలిపెడిని | ॥కను॥ |


