శృంగార సంకీర్తన
రేకు: 44-3
సంపుటము: 6-15
రేకు: 44-3
సంపుటము: 6-15
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| పచ్చి కస్తురి నీకు బ్రాఁతిగాని ఒచ్చెమని పూయ నొల్లమి దెన్నఁడును | ॥పల్లవి॥ |
| తట్టుపునుఁ గొడల నంతటా నలంది దిట్టవై పరిమళానఁ దిరిగేవు ఇట్టిది మాయడవిలో నింతా నిదే ఒట్టి యుండు నే మొల్ల మిదెన్నఁడును | ॥పచ్చి॥ |
| కప్పురపుఁ దావి తోడఁ గదియుచు చిప్పిలెటి చెమటలఁ జెలంగేవు తప్పక యింటింట దీని తరువులే నే మెప్పుడు మాచేత నంట మిదెన్నఁడును | ॥పచ్చి॥ |
| జవ్వాది శిరసు నిండఁ జమరుకా యిట్టె పవ్వళించే విదె నాపక్కనీవు రవ్వయిన వేంకటరమణుఁడా మే మెవ్వరమూ దీని నెఱుఁగ మెన్నఁడును | ॥పచ్చి॥ |


