శృంగార సంకీర్తన
రేకు: 44-4
సంపుటము: 6-16
రేకు: 44-4
సంపుటము: 6-16
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| వలపుల దాడి వచ్చె వనితలారా మరుం- డెలగోలేయంగఁ జొచ్చె నేలాగే | ॥పల్లవి॥ |
| తూరుపునం బొడిచెఁ జందురుఁడు మిన్నుల మోవ పాఱుతెంచె విరహుల బందికాఁడు గోరపు వెన్నెల వెల్లి గొని మీఁదమీఁద నిప్పు లేఱై పారఁగఁజొచ్చె నెందు చొత్తమే | ॥వలపు॥ |
| చందనపుఁ గొండ వంక చల్లగాలి తుదముట్టి ముందు ముందె కదిసె దుమ్ములు లేవఁగా మందమై పన్నీటి సోన మందు చల్లె నమ్ములై యెందు చూచినఁ దానె యేమి సేతమె | ॥వలపు॥ |
| క్రొచ్చి పారె గుబ్బచన్నుఁ గొండల చెమ్మటనీరు రొచ్చుగం గరి దరులు జారఁగా పచ్చిగా వేంకటగిరి పతి యింతిఁ గూడఁగాను ఇచ్చకాలె గనమాయె నింక నేఁటిదే | ॥వలపు॥ |


