శృంగార సంకీర్తన
రేకు: 44-5
సంపుటము: 6-17
రేకు: 44-5
సంపుటము: 6-17
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| వలదన నొరులకు వసమటవే తలఁచినట్ల నిది దైవమే చేసె | ॥పల్లవి॥ |
| తరుణి కుచములను తామర మొగుడలు విరిసేనోయని వెరపునను సరగునఁ బతి నఖ చంద్రశకలములు దరులఁ గలుగ నివి దైవమె చేసె | ॥వలద॥ |
| పొలిఁతి వదనమును పున్నమ చంద్రుఁడు బలిమి నెగయునని భయమునను మెలఁత చికుర ధమ్మిల్లపు రాహువు తలఁ జెదరఁగ నిది దైవమే సేసె | ॥వలద॥ |
| వనితకు వాడునొ వలపు తాపమున తనులతికయనుచుఁ దమకమున ఘన వేంకటపతి కౌఁగిట చెమటలఁ దనివి దీర్చనిది దైవమె సేసె | ॥వలద॥ |


