అధ్యాత్మ సంకీర్తన
రేకు: 4-8
సంపుటము: 1-28
రేకు: 4-8
సంపుటము: 1-28
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| పాపపుణ్యముల రూపము దేహ మిది దీని- దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు | ॥పాప॥ |
| అతిశయంబైన దేహభిమానము దీర [1]గతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదు మతిలోని దేహభిమానంబు విడుచుటకు రతి[2]పరాఙ్ముఖుఁడు గాక రపణంబు లేదు | ॥పాప॥ |
| సరిలేని మమకారజలధి దాఁటిఁనఁ గాని అరుదైన నిజసౌఖ్య మది వొందరాదు తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁ గాని పరగు బ్రహ్మానందపరుఁడుఁ దాఁ గాఁడు | ॥పాప॥ |
[1] ‘గతిగాని’ అని వుండవచ్చు.
[2] ‘పరాన్ముఖుడు’ అని రేకు.


