అధ్యాత్మ సంకీర్తన
రేకు: 5-5
సంపుటము: 1-34
రేకు: 5-5
సంపుటము: 1-34
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
| ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ జెన్నలర హరిసేవ సిద్ధించుకొరకు | ॥ఇన్నియు॥ |
| అరయ వేదాధ్యయన మది బ్రహ్మశుద్ధికొర- కిరవైన శాస్త్రంబు లెరుకకొరకు తరి యజ్ఞములు రుణోత్తారమయ్యెడికొరకు సరిలేని దానములు జన్మములకొరకు | ॥ఇన్నియు॥ |
| మమకారదూరంబు మనసు గెలుచుటకొరకు సమవివేకంబు శాంతములకొరకు అమర శ్రీతిరువేంకటాద్రీశు మనసు [1]నీ- జము గెలుచు బ్రహ్మవిజ్ఞానంబుకొరకు | ॥ఇన్నియు॥ |
[1] ‘ని-జము గెలుచు బ్ర్రహ్మవిజ్ఞానంబు కొఱకు’ అని పూ.ము.పా.


