అధ్యాత్మ సంకీర్తన
రేకు: 67-2
సంపుటము: 1-347
రేకు: 67-2
సంపుటము: 1-347
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| ఎంత బోధించి యేమి సేసినఁ దన- దొంతికర్మములు తొలఁగీనా | ॥ఎంత॥ |
| సతతదురాచారజడునకుఁ బుణ్యసం- గతి దలపోసినఁ గలిగీనా అతిపాపకర్మబోధకుఁడై వెలయు దుష్టు మతిఁ దలపోసిన మరి కలిగీనా | ॥ఎంత॥ |
| బహుజీవహింసాపరుఁడైనవానికి యిహపరములు దైవ మిచ్చీనా విహితకర్మములు విడిచినవానికి సహజాచారము జరిగీనా | ॥ఎంత॥ |
| దేవదూషకుఁడై తిరిగేటివానికి దేవతాంతరము దెలిసీనా శ్రీవేంకటేశ్వరుఁ జింతిపకుండిన పావనమతుఁడై(మతియై?) బ్రతికీనా | ॥ఎంత॥ |


