Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 5-6
సంపుటము: 1-35
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ-
వాని [1]నన్నొకయింత వదలక [2]నను నేలవలదా
॥ఏ నిన్ను॥
అపరాధిఁ గనక నన్నరసి కావుమని
అపరిమితపు భయ మంది నీకు శరణంటిఁ గాక
నెపములేక నన్ను నీకుఁ గావఁగనేల
అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా
॥ఏ నిన్ను॥
ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ-
వనవరతము నా యాతుమ విహరించుమంటిఁ గాక
యెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు-
ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప
॥ఏ నిన్ను॥

[1][2] పునరుక్తి. ఇట్టి వక్కడక్కడ గలవు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము