అధ్యాత్మ సంకీర్తన
రేకు: 69-5
సంపుటము: 1-362
రేకు: 69-5
సంపుటము: 1-362
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| ప్రాణుల నేరమి గాదిది బహుజన్మపరంపరచే ప్రాణులు సేసిన తమతమ పాపఫలము గాని | ॥ప్రాణుల॥ |
| హరి సకలవ్యాపకుఁడని అందరుఁ జెప్పఁగ నెరిఁగియు పరదైవంబులఁ గొలువక పాయరు మానవులు నరపతి భూమేలఁగ భూవరు భజియింపఁగ నొల్లక పరిసరవర్తుల బెంబడిఁ బనిసేనినయట్లు | ॥ప్రాణుల॥ |
| పొందుగ తమతమ సేసిన పూజలు మ్రొక్కులు గైకొను(న?) అందముగాఁ బురుషోత్తముఁ డాతఁడే కలఁడనియు అందరు నెరిఁగియు యితరులఁ జెందుదు రున్నతశైలము నందక చేరున తరువుల నందుకొనినయట్లు | ॥ప్రాణుల॥ |
| శ్రీవేంకటపతి యొక్కఁడె చెప్పఁగ జగములకెల్లను దైవము నాతుమలోపలి ధనమనఁగా వినియు సేవింపరు పామరు లీదేవుని మధురంబొల్లక వావిరిఁ బులుసులు చేఁదులు వలెననుకొనునట్లు | ॥ప్రాణుల॥ |


