Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 69-6
సంపుటము: 1-363
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
ఘోరదురితములచే గుణవికారములచే-
నీరీతిఁ బడు నాకు నేది దెరువు
॥ఘోర॥
హరి జగన్నాథు [1]లోకారాధ్యు-
నెరఁగనేరనివాని కేది దెరువు
పరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి-
నిరవు కొలుపనివాని కేది దెరువు
॥ఘోర॥
శ్రీవేంకటేశుఁ దలఁచిన వెనక సకలంబు
నేవగింపనివారి కేది దెరువు
దేవోత్తముని మహిమ దెలిసి తెలియఁగలేని
యీ వివేకంబునకు నేది దెరువు
॥ఘోర॥

[1] ఇందు ‘అఖిలాత్మవంటి’ పామొకటి యైదుమాత్రలది లోపించినది గాఁబోలును.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము