అధ్యాత్మ సంకీర్తన
రేకు: 70-2
సంపుటము: 1-365
రేకు: 70-2
సంపుటము: 1-365
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం, జంపెతాళం
| అణురేణుపరిపూర్ణుఁడైన శ్రీవల్లభునిఁ బ్రణుతించువారువో బ్రాహ్మలు | ॥అణు॥ |
| హరి నామములనె సంధ్యాది విధులొనరించు పరిపూర్ణమతులువో బ్రాహ్మలు హరిమంత్ర వేదపారాయణులు హరిభక్తి- పరులైనవారువో బ్రాహ్మలు | ॥అణు॥ |
| యేమి చూచినను హరి యిన్నిటాఁ గలఁడనుచు భావించువారువో బ్రాహ్మలు దేవకీనందనుఁడె దేవుఁడని మతిఁదెలియు పావనులు వారువో బ్రాహ్మలు | ॥అణు॥ |
| ఆదినారాయణుని ననయంబుఁ దమ యాత్మఁ బాదుకొలిపినవారు బ్రాహ్మలు వేదరక్షకుఁడైన వేంకటగిరీశ్వరుని పాదసేవకులువో బ్రాహ్మలు | ॥అణు॥ |


