అధ్యాత్మ సంకీర్తన
రేకు: 70-5
సంపుటము: 1-368
రేకు: 70-5
సంపుటము: 1-368
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| భోగీంద్రులును మీరుఁ బోయి రండు వేగన మీఁదటి విభవాలకు | ॥భోగీంద్రు॥ |
| హరుఁడ పోయిరా; అజుఁడ నీవును బోయి తిరిగిరా మీఁదటి తిరుణాళ్ళకు; సురలు మునులును భూసురలుఁ బోయి రండు అరవిరి నిన్నాళ్ళు నలసితిరి | ॥భోగీంద్రు॥ |
| జముఁడ పోయిరా; శశియు[1] నీవును బోయి సుముఖుఁడవై రా సురలఁ గూడి; గుములై దిక్పతులు దిక్కులకుఁ బోయి రండు ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి | ॥భోగీంద్రు॥ |
| నారద సనకసనందనాదులు భూరి విభవములఁ బోయిరండు; దూరముగాఁ బోకిట్టే[2] తొరలి వేంకటగిరిఁ జేరి నన్నిట్లనే సేవించుఁడీ | ॥భోగీంద్రు॥ |
[1] (నిడురేకు 58) శని.
[2] (నిడురేకు 58) దూరంగాకిట్టే.


