Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 78-1
సంపుటము: 1-370
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
[1]ఎట్టు వేగించే దిందుకేగురే సితరకాండ్లు
వెట్టివేమి సేయుమంటా వెన్నడించే రిపుడు
॥ఎట్టు॥
వొంటికాలఁ గుంటికుంటి వూరిబందెలకుఁ జిక్కి
పంటదాఁకా దున్నె నొక్కపసురము
గంటుగంటులాక లొత్తి కల్లల నడిమిపంట
కుంటివాఁడు గావలుండి కుప్ప లేరుపరచె
॥ఎట్టు॥
కలది కుక్కిమంచము కన్నవారెల్లాఁ బండేరు
తలెతో [2]దొగ్గినంబలి దావకూళ్ళు
వెలిఁ గంతల కొంపలు వీడుఁ బట్లు చూపేరు
తలవరులెందులోనాఁ దప్పు వెదకేరు
॥ఎట్టు॥
వొళ్ళుచెడ్డవాఁ డొకఁడు వుభయమార్గము గొని
కల్లదొర పుట్టుబడి కడుఁగట్టీని
చల్లని శ్రీవేంకటేశ సకలలోకపతివి
యిల్లిదె నీశరణంటి మిందరిని గావవే
॥ఎట్టు॥

[1] దీని భావము స్పష్టమగుట లేదు.

[2] ‘డొగ్గి’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము