అధ్యాత్మ సంకీర్తన
రేకు: 78-3
సంపుటము: 1-372
రేకు: 78-3
సంపుటము: 1-372
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| దేవ నీవిచ్చేయందుకు దీనికిఁ గా నింతయేల యేవేళ మా యెరుకలు యెందుకుఁ గొలుపును | ॥దేవ॥ |
| యెవ్వరి వసములు బుద్దెరిఁగి నడచేమన యివ్వల నారాయణ నీవియ్యక లేదు దవ్వు చేరువ మనసు తన యిచ్చయితేఁ గనక రవ్వగ మృగాదులెల్ల రాజ్యమేలనేరవా | ॥దేవ॥ |
| సారెకు నిన్నుఁ దలపించ జంతువుల వసమా కేరి నీవు జిహ్వఁ బరికించఁగాఁ గాక యీరీతి లోకమెల్లాఁ దమ యిచ్చ కొలఁదుల నయితే దూరానఁ గొక్కెరలు చదవవా వేదాలు | ॥దేవ॥ |
| యిందరి పాపపుణ్యాలు యిన్నియు నీ చేఁతలే కుందవ స్వతంత్రులు గారు గాన చందపు శ్రీవేంకటేశ శరణంటి నిదె నీకు చెంది నీవే కాతుగాక చేఁతలూనువలెనా | ॥దేవ॥ |


