అధ్యాత్మ సంకీర్తన
రేకు: 78-4
సంపుటము: 1-373
రేకు: 78-4
సంపుటము: 1-373
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| పరుసమొక్కటే కాదా పయిఁడిగాఁ జేసేది అరయ లోహమెట్టున్నా నందుకేమీ | ॥పరుస॥ |
| వనజనాభుని భక్తి వదలకుండినఁ జాలు మనసు యెందు దిరిగినా మరి యేమి మొనసి ముద్రలు భుజముల నుండితేఁ జాలు తనువెంత హేయమైనా దానికేమి | ॥పరుస॥ |
| శ్రీకాంతు నామము జిహ్వఁ దగిలితే జాలు యే కులజుఁడైనాను హీనమేమి సాకారుఁడైన హరి శరణుచొచ్చినఁ జాలు చేకొని పాపము లెన్ని చేసిననేమి | ॥పరుస॥ |
| జీవుఁ డెట్టున్నానేమి జీవునిలో యంతరాత్మ శ్రీవేంకటేశున కా చింతయేమి యే వలనఁ బరమైన యిహమైన మాకుఁ జాలు కైవశమాయ నతఁడు కడమలింకేమీ | ॥పరుస॥ |


