అధ్యాత్మ సంకీర్తన
రేకు: 79-6
సంపుటము: 1-381
రేకు: 79-6
సంపుటము: 1-381
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| అంతర్యామీ అలసితి సొలసితి యింతట నీ శరణిదె చొచ్చితిని | ॥అంతర్యామీ॥ |
| కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపుఁ బగ్గాలు పాపపుణ్యములు నేరుపులఁ బోనీవు నీవు వద్దనక | ॥అంతర్యామీ॥ |
| జనుల సంగములఁ జక్కరోగములు విను విడువవు నీవు విడిపించక వినయపు దైన్యము విడువని కర్మము చన దది నీవిటు [1]సంతపరచక | ॥అంతర్యామీ॥ |
| మదిలో చింతలు మయిలలు మణుఁగులు వదలవు నీవవి వద్దనక యెదుటనెఁ శ్రీవేంకటేశ్వర నీవదె అదనఁ గాచితివి అట్టిట్టనక | ॥అంతర్యామీ॥ |
[1] ‘సంతపరచు’ = శాంతపరచు అని అర్థము కావచ్చు.


