అధ్యాత్మ సంకీర్తన
రేకు: 82-3
సంపుటము: 1-395
రేకు: 82-3
సంపుటము: 1-395
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| కింకదీర ‘న దైవం కేశవాత్పర’ మని ఉంకువైన నాలో నీ వుపమలివే | ॥కింక॥ |
| కంటి నీవొక్కఁడవే లోకములకు దైవమని వొంటి మఱి నిన్నుఁ బోల నొకరిఁ గాన వింటి నీవే ఘనమని వేదాంతమందు నీ- కంటె నితరము వినఁ గరుణానిధీ | ॥కింక॥ |
| తోఁచె నాకు నీ సేవే తుదిపదమని; మఱి తోఁచ దీబుద్ధికి; సరితూఁగ దెందును పూఁచి నా గురుఁడు నిన్నే బోధించేగాని మఱి దాఁచఁడాయ నీ మహిమ ధరణీధరా | ॥కింక॥ |
| సమ్మతించె నా మతి జవియైనా(నీ?) కథలె సమ్మతించ [1]దెక్కడో రచ్చల సుద్దులు నమ్మిక శ్రీవేంకటేశ నంటున నీ పాదాలే నమ్మితి నేమియు నమ్మ నారాయణా | ॥కింక॥ |
[1] ‘నెక్కడో’ పూ.ము.పా.


