అధ్యాత్మ సంకీర్తన
రేకు: 86-3
సంపుటము: 1-419
రేకు: 86-3
సంపుటము: 1-419
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| ఎవ్వరివాఁడో యీదేహి యివ్వలనవ్వల నీదేహి | ॥ఎవ్వరి॥ |
| కామించు నూరకే కలవియు లేనివి యేమి గట్టుకొనే నీదేహి వాములాయ నిరువదియొక వావులు యేమని తెలిసెనో యీదేహి | ॥ఎవ్వరి॥ |
| కందువ నిజములు గల్లలు నడిపీ యెందుకు నెక్కెనో యీ దేహి ముందర నున్నవి మొగిఁ దనపాట్లు యిందే భ్రమసీ నీదేహి | ॥ఎవ్వరి॥ |
| పంచేంద్రియముల పాలాయ జన్మము యించుక యెఱఁగఁడు యీదేహి అంచెల శ్రీవేంకటాధీశ నీకృప వంచఁగ గెలిచెను వడి నీదేహి | ॥ఎవ్వరి॥ |


