అధ్యాత్మ సంకీర్తన
రేకు: 94-6
సంపుటము: 1-470
రేకు: 94-6
సంపుటము: 1-470
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకు పన్నిన లోకులకెల్ల ప్రకృతి కారణము | ॥అన్నిటికి॥ |
| తలఁపు గారణము తత్వవేత్తలకును చలము గారణము సంసారులకును ఫలము గారణము పరమవేదాంతులకు కలిమి గారణము కర్ములకును | ॥అన్నిటికి॥ |
| తన యాత్మ గారణము తగిన సుజ్ఞానులకు తనువే కారణము తగ జంతువులకు ఘనము క్తి గారణము కడ గన్నవారికెల్లా కనకమే కారణము కమ్మిన బంధులకు | ॥అన్నిటికి॥ |
| దేవుఁడు గారణము తెలిసినవారికెల్లా జీవుడు గారణము చిల్లరమనుజులకు దేవుడు వేరే కాఁడు దిక్కు శ్రీవేంకటేశుఁడే పావన మాతని కృప పరమకారణము | ॥అన్నిటికి॥ |


