అధ్యాత్మ సంకీర్తన
రేకు: 99-4
సంపుటము: 1-498
రేకు: 99-4
సంపుటము: 1-498
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| అంచితపుణ్యులకైతే హరి దైవమవుఁ గాక పంచమహాపాతకుల భ్రమ వాప వశమా | ॥అంచిత॥ |
| కానని యజ్ఞానులకు కర్మమే దైవము ఆనిన బద్ధులకు దేహమే దైవము మానని కాముకులకు మగువలే దైవము పానిపట్టి వారివారి భ్రమ మాన్ప వశమా | ॥అంచిత॥ |
| యేమీ నెఱఁగనివారి కింద్రియములు దైవము దోమటి సంసారి కూరదొర దైవము తామసుల కెల్లాను ధనమే దైవము పామరుల బట్టినట్టి భ్రమఁ బాప వశమా | ॥అంచిత॥ |
| ధర నహంకారులకు తాఁ దానే దైవము దరిద్రుఁడైనవారికి దాత దైవము యిరవై మాకు శ్రీవేంకటేశుఁడే దైవము పరుల ముంచినయట్టి భ్రమఁ బాప వశమా | ॥అంచిత॥ |


