అధ్యాత్మ సంకీర్తన
రేకు: 8-3
సంపుటము: 1-51
రేకు: 8-3
సంపుటము: 1-51
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| నదు లొల్లవు నా స్నానము కడు- సదరము నాకీ స్నానము | ॥నదు॥ |
| ఇరువంకల [1]నీ యేచిన ముద్రలు ధరియించుటే నా స్నానము ధరపై నీ నిజదాసుల దాసుల చరణధూళి నా స్నానము | ॥నదు॥ |
| తలఁపులోన నినుఁ దలఁచినవారలఁ దలఁచుటే నా స్నానము వలనుగ నినుఁ గనువారల శ్రీపాద- జలములే నా స్నానము | ॥నదు॥ |
| పరమభాగవతపాదాంబుజముల దరుశనమే నా స్నానము తిరువేంకటగిరిదేవ నీ కథా- స్మరణమే నా స్నానము | ॥నదు॥ |
[1] ‘నీవేచిన’ అని పూ.ము.పా.


