అధ్యాత్మ సంకీర్తన
శ్రీరంగం రేకు: 98-6
సంపుటము: 1-512
శ్రీరంగం రేకు: 98-6
సంపుటము: 1-512
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| [1]ఏకతాన వున్నవాఁడు యిదివో వీఁడె చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు | ॥ఏకతాన॥ |
| మంచిమంచి పన్నీట మజ్జన మవధరించి పంచమహావాద్యాలతో పరమాత్ముఁడు అంచలఁ గప్పురకాపు అంగముల మెత్తికొని కొంచక నిలుచున్నాఁడు గోణాముతోడను | ॥ఏకతాన॥ |
| తట్టుపుణుఁ గామీఁద దట్టముగ నించుకొని తెట్టెలై వేదనాదాల దేవదేవుఁడు గుట్టుతోడ సొమ్ములెల్లా(ఁ?) గుచ్చికుచ్చి కట్టుకొని వెట్టదీర సురట్ల విసరించుకొంటాను | ॥ఏకతాన॥ |
| తనిసి యలమేల్మంగఁ దాళిఁగా గట్టుకొనె వెనుకొని యిదివో శ్రీవేంకటేశుఁడు మునుకొని యారగించి మూఁడులోకములు మెచ్చ చనవరి సతులలో సరసమాడుతాను | ॥ఏకతాన॥ |
[1] ఈ పాటలెల్లా స్వామి మజ్జనమును వర్ణించినవే. ఆ స్నానవేళ స్వామిలో అక్కడక్కడ కనబడిన శృంగారరేఖలు, అధ్యాత్మమునకును సహజములే.


