అధ్యాత్మ సంకీర్తన
రేకు: 102-4
సంపుటము: 2-10
రేకు: 102-4
సంపుటము: 2-10
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| అతిసులభం బిది యందరిపాలికి గతియిది శ్రీపతి కైంకర్యంబు | ॥పల్లవి॥ |
| పాలసముద్రము బలిమిఁ దచ్చికొని- రాలరిదేవత లమృతమును నాలుక నిదె హరినామపుటమృతము యేల కానరో యిహపరసుఖము | ॥అతి॥ |
| అడరి బాఁతిపడి యవని దేవతలు బడివాయరు యజ్ఞభాగాలకు విడువక చేతిలో విష్ణుప్రసాదము కడిగడియైనది కానరు గాని | ॥అతి॥ |
| యెక్కుదురు దిగుదు రేడులోకములు పక్కనఁ దపముల బడలుచును చిక్కినాఁడు మతి శ్రీవేంకటేశ్వరుఁ - డిక్కడి తుదిపద మెఱఁగరు గాని | ॥అతి॥ |


