అధ్యాత్మ సంకీర్తన
రేకు: 8-5
సంపుటము: 1-53
సంస్కృతకీర్తన
రేకు: 8-5
సంపుటము: 1-53
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జం | ॥వందే॥ |
| ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ- చందనాంకిత లసచ్చారుదేహం మందారమాలికామకుటసంశోభితం కందర్పజనక మరవిందనాభం | ॥వందే॥ |
| ధగధగిత కౌస్తుభా[1]ధరణ [2]వక్షస్థలం ఖగరాజవాహనం కమలనయనం [3]నిగమాదిసేవితం నిజరూపశేష ప- న్నగరాజశాయినం [4]ఘననివాసం | ॥వందే॥ |
| [5]కరిపురనాథసంరక్షణే తత్పరం కరిరాజవరదసంగతకరాబ్జం సరసీరుహాననం చక్రవిభ్రాజితం తిరువేంకటాచలా [6]దేవం భజే | ॥వందే॥ |
[1] ‘దరణ’ కావచ్చు.
[2] వక్షస్స్థలం అని పూ.ము.పా.
[3] ‘నిగమాదిసేవితం’ కావచ్చు. ఆదిశబ్దముచేత ఉపనిషచ్ఛాస్త్రపురాణములు సేవించినట్టు.
[4] ‘నగ’ కావచ్చు. కానిచో యతిభంగమగునేమో?
[5] కృష్ణరాయబారము ఉద్దేశింపబడినదా? లేక ‘కరిపురనాథ’ శబ్దముతో అర్జునుడో పాండవులో ఉద్దేశింపబడిరా?
[6] ‘ధీశం’ కావచ్చు.


