అధ్యాత్మ సంకీర్తన
రేకు: 107-6
సంపుటము: 2-42
రేకు: 107-6
సంపుటము: 2-42
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| తుద సమస్తమును దుర్లభమే అదె సులభుఁడు మాహరి యొకఁడే | ॥పల్లవి॥ |
| సురలును నరులును సొంపగు సిరులును వొరసిన నిన్నియు నుపాధులే నిరుపాధికుఁడును నిజకరుణానిధి అరయఁగ నిదె మాహరి యొకఁడే | ॥తుద॥ |
| అందరియీవులు నఖిలకర్మములు అందఁగరాని ప్రయాసములే యిందిరారమణి నేచిన సేవిది చెందరు సుజనులు చెప్పంగలదె | ॥తుద॥ |
| యితరోపాయము లేవి చూచినా శ్రుతివిరహితములు శూన్యములే రతి శ్రీవేంకటరమణునిమతి యిది హితపరిపూర్ణం బిది యొకటే | ॥తుద॥ |


