అధ్యాత్మ సంకీర్తన
రేకు: 9-6
సంపుటము: 1-60
రేకు: 9-6
సంపుటము: 1-60
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవే వేదవిరహితులకు వెఱతు మటుగాన | ॥ఏది॥ |
| ఇరవుకొని రూపంబులిన్నిటానుఁ గల నిన్నుఁ బరికించవలెఁగాని భజియింపరాదు గరిమ చెడి [1]సత్సమాగంబు విడిచిన నీ స్మరణ విజ్ఞానవాసన గాదుగాన | ॥ఏది॥ |
| యిహదేవతాప్రభలనెల్ల వెలుఁగుట నీకు సహజమనవలెఁ గాని సరిఁ గొలువరాదు అహిమాంశుకిరణంబు లన్నిచోట్లఁ బరగు గ్రహియింపరా దవగ్రాహములు గాన | ॥ఏది॥ |
| యింతయునుఁ దిరువేంకటేశ నీ వునికిఁ దగఁ జింతింపవలెఁ గాని సేవింపరాదు అంతయు [2]ననరుహమును నరుహం బనఁగరాదు అంతవానికిఁ బరుల కలవడదుగాన | ॥ఏది॥ |
[1] ‘సత్సమాగమము’ అని పూ.ము.పా.
[2] ‘అనర్హ’, ‘అర్హ’ అని పూ.ము.పా.


