అధ్యాత్మ సంకీర్తన
రేకు: 10-4
సంపుటము: 1-64
రేకు: 10-4
సంపుటము: 1-64
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది పావనుల హృదయమునఁ బ్రభవించుఁ గాని | ॥ఈ విశ్వాస॥ |
| ఇమ్మయిన పాపంబు లెన్నివలసినఁ బ్రాణి సమ్మతంబున జేయఁజాలుఁ గాకేమి కుమ్మరికి నొకయేఁడు గుదియ కొకనాఁడవును నమ్మి తలఁచిన విష్ణునామంబుచేత | ॥ఈ విశ్వాస॥ |
| కొదలేని దురితములు [1]కొండలునుఁ గోట్లును చెదర కెప్పుడుఁ బ్రాణి చేయుఁ గాకేమి పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను హృదయంబు హరిమీఁద నుండినంతటను | ॥ఈ విశ్వాస॥ |
| సరిలేని దుష్కర్మసంఘములు రాసులై పెరుగఁ జేయుచు ప్రాణి పెంచుఁ గాకేమి బెరసి కొండలమీఁదఁ బిడుగువడ్డట్లౌను తిరువేంకటాచలాధిపునిఁ దలఁచినను | ॥ఈ విశ్వాస॥ |
[1] ‘కొండలుఁగోట్లును’ అని పూ.ము.పా.


