అధ్యాత్మ సంకీర్తన
రేకు: 10-5
సంపుటము: 1-65
రేకు: 10-5
సంపుటము: 1-65
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| తన కర్మవశం బించుక, దైవకృతం బొకయించుక, మనసు వికారం బించుక, మానదు ప్రాణులకు | ॥తన॥ |
| ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులు యీదురవస్థలు గతులును యీలంపటములును యీదాహము లీదేహము లీయనుబంధంబులు మరి యీదేహము గలకాలము యెడయవు ప్రాణులకు | ॥తన॥ |
| యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు నీచొక్కులు నీపొక్కులు నీవెడయలుకలును యీచెలుములు నీబలువులు నీచనవులు నీఘనతలు నీచిత్తము గలకాలము యెడయవు ప్రాణులకు | ॥తన॥ |
| యీవెరవులు నీయెరుకవులు యీతలఁపులు నీతెలువులు దైవశిఖామణి తిరుమలదేవుని మన్ననలు దైవికమున కిటువగవక తన తలఁ పగ్గలమైనను దైవము తానౌ తానే దైవంబవుఁగాన | ॥తన॥ |


